ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను…
ప్రతిరోజూ ఇంకాస్త మంచి మనిషిగా మారడానికి ప్రయత్నిస్తుండాలి. నిన్నటి కంటే మెరుగ్గా ఉండటానికి కష్టపడుతుండాలి. దానికోసం మనతో మనమే ఫైట్ చేస్తుండాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను అన్నారు రాశీఖన్నా. నటి అయ్యాక ఈ ఏడేళ్లలో నటిగా, వ్యక్తిగా మీలో గమనించిన మార్పేంటి? అని రాశీని అడగ్గా.. ఈ ప్రయాణంలో చాలా మార్పు గమనించాను. రకరకాల పాత్రలు పోషించడం నా ఆలోచనా విధానంపై చాలా ప్రభావం చూపింది. నా ఆలోచన పరిధి విస్తృతం అయింది. ఏ విషయాన్నీ ముందే జడ్జ్ చేయడం లేదు. గతంలో వెంటనే రియాక్ట్ అవ్వడం, టక్కన కోపం రావడం జరిగేవి. ఇప్పుడు తగ్గింది. చాలా శాంతమయ్యాను. ప్రస్తుతం నేను పాటించేది నిన్నటికంటే బెటర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నారు.













