అది లేకపోతే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం
రాశీఖన్నా మల్టీటాలెంటెడ్ అనడానికి చాలా కారణాలున్నాయి. ఆమె మంచి నటే కాదు. కవితలతో మెప్పించగలదు. మధురమైన గొంతుతో పాడి అలరించగలదు. అలాగే ఆమెలో చక్కని హాస్యనటి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకూ తనలో ఉన్న కమెడియన్ బయటకు రాలేదని అప్పుడప్పుడూ చెబుతుంటుంది. ఛాన్స్ వస్తే మాత్రం తనలో ఆ యాంగిల్‌ని ప్రదర్శిస్తానంటోంది. ఇటీవల తొలిప్రేమ, శ్రీనివాస కల్యాణం సినిమాలతో ఆకట్టుకున్న ఆమెను పరిశ్రమలో పోటీ గురించి అడిగితే ఏ ఇండస్ట్రీలోనైనా పోటీ అనేది సహజం. ఒక మనిషి ఎదిగినా, పడిపోయినా అది పోటీ వల్లే జరుగుతుంది. అదే లేకపోతే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. నేర్చుకోవడానికీ, ఎదగడానికి ఛాన్స్ ఉండదు. అందుకే పోటీని నేనెప్పుడూ స్వీకరిస్తా. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి. నా ఫ్రెండ్స్ రకుల్, రెజీనా, లావణ్య అందరం పోటీపడి పని చేస్తాం. అది వృత్తి వరకే. సెట్లో పేకప్ చెప్పాక మేమంతా స్నేహితులమే అని తెలిపింది రాశీఖన్నా.













