అందులో తప్పేమీ లేదు… ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వను
యంగ్ హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్‌గా కనిపిస్తూ, అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. కానీ కొంతమంది భామలు నిజ జీవితంలో కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుర్ర హీరోయిన్ రాశీఖన్నా కూడా అదే తరహాలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోందట. అమ్మడు షూటింగ్ పూర్తయిన తర్వాత పార్టీల్లో సందడి చేస్తుంది. పబ్బులు, డిస్కోథెక్‌లలో హల్చల్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ప్రతిరోజు పార్టీలో దర్శనమిస్తుందంటే రాశీఖన్నా ఎంత స్పీడో అర్థమవుతుంది. పార్టీలు ఇవ్వడం, తీసుకోవడం, విషయంలో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోదట ఈ భామ. అర్థరాత్రి వరకు ఈ భామ పార్టీలోనే గడుపుతుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఈ యాంగ్ హీరోయిన్ మాట్లాడుతూ నాకు నైట్ లైఫ్ అన్నా.. పార్టీలన్నా మహా ఇష్టం. ఇందులో తప్పేమీ లేదు. నేను షూటింగ్‌కు ఆసల్యంగా వస్తే తప్ప.. నా మీద ఫిర్యాదు చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. రాత్రంతా పార్టీలో ఎంజాయ్ చేసినా ఉదయాన్నే సమయానికి షూటింగ్‌కు వచ్చేయగలను అని చెప్పింది.













