Rapo22: రాపో22 రిలీజ్ డేట్ పై అప్డేట్
రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) ఫేమ్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో ఓ మూవీ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. రాపో22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ ను రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Thaluka) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అదే సినిమా రిలీజ్ డేట్. రాపో22(RAPO22) ను సెప్టెంబరులో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మే 15న రామ్ బర్త్ డే రిలీజ్ చేయబోయే గ్లింప్స్ తో పాటూ రిలీజ్ డేట్ గురించి కూడా మేకర్స్ రివీల్ చేసే ఛాన్సుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ ఓ హీరోకి అభిమానిగా కనిపించనున్నాడు. ఆ హీరో పాత్రలో ఉపేంద్ర(Upendra) కనిపించనున్నాడు. సినిమాలో ఆయన ఆంధ్రా కింగ్ గా కనిపించనుండగా, రామ్ అతని అభిమానిగా ఆంధ్రా కింగ్ తాలూకా అని చెప్పుకుంటూ ఉంటాడన్నమాట. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులందుకుంటున్న రామ్, ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.






