డీసెంట్ రెస్పాన్స్ తో ముందుకెళ్తున్న రావు రమేష్ సినిమా
స్టార్ హీరో అయితేనో లేదంటే కంటెంట్ యూత్‌ఫుల్ సినిమా అయితేనో తప్పించి ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. అలాంటిది రావు రమేష్ ను హీరోగా పెట్టి సినిమా చేయడమంటే సాహసమనే చెప్పాలి. ఎంత సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరిస్తే మాత్రం ఆడియన్స్ థియేటర్లకు వచ్చి టికెట్స్ కొనరుగా. అందుకే సినిమాకు హైప్ పెంచడానికి అల్లు అర్జున్ ను తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.
మొత్తానికి ఈవెంట్ చాలా అట్టహాసంగా జరిగి సినిమా ఆడియన్స్ లోకి వెళ్లింది. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వీకెండ్ లో డీసెంట్ ఆక్యుపెన్సీలు వచ్చాయి. బుక్ మై షో లో ఈ సినిమాకు ఒక రోజులో 8వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇందులో సగం కూడా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలకు బుక్ అవలేదు.
మరుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోయినా డీసెంట్ రెస్పాన్స్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తుంది. రీసెంట్ గా అజయ్ ఘోష్ చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి మంచి కంటెంట్ తో వచ్చినప్పటికీ దానికి బాక్సాఫీస్ పరంగా మంచి రిజల్ట్ దక్కలేదు. అలాంటిది రావు రమేష్ సినిమా ఈ మాత్రం కలెక్ట్ చేయడం గొప్ప విషయమే.













