రోజుకి రావు రమేష్ ఎంత తీసుకుంటాడంటే
రావు గోపాలరావు కొడుకుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ చాలా తక్కువ కాలంలోనే యాక్టర్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో ఆయనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రావు రమేష్ ఇప్పటికీ తెలుగులో లీడింగ్ యాక్టర్లలో ఒకడిగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. అయితే ఒకప్పటిలా వచ్చిన ప్రతీ సినిమాను ఆయన చేయడం లేదు.
చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుని తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉందనుకుంటేనే సినిమాలను ఓకే చేస్తున్నప్పటికీ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఉన్నాడు. రీసెంట్ గా ఆయన లీడ్ రోల్ లో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ముందుకెళ్తుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తన రెమ్యూనరేషన్ గురించి రావు రమేష్ ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. తను రోజుకు రూ.4.5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయని, అయితే తను తీసుకునే ప్రతీ రూపాయి వైట్ రూపంలోనే తీసుకుంటానని, తన రెమ్యూనరేషన్ కు ట్యాక్ కూడా కడుతున్నానని ఆయన తెలిపారు. అలాగే అన్ని సినిమాలకీ ఒకేలా పారితోషికం ఉండదని, కొన్నిసార్లు బేరాలు కూడా ఆడతారని అన్నారు. అయితే క్యారెక్టర్ నచ్చితే మాత్రం తన రెమ్యూనరేషన్ ఎంత తక్కువైనా సరే ఆ సినిమా చేస్తానని రావు రమేష్ తెలిపారు.













