83 కపిల్‌దేవ్ లుక్ విడుదల !
బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడానేపథ్య చిత్రాలపై ప్రేక్షకులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల దృష్టి మొత్తం కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 83 చిత్రంపైనే వుంది. 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కపిల్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కపిల్, మహీందర్ అమర్నాథ్, బల్వీందర్సింగ్లతో కలిసి ధర్మశాల వెళ్లిన రణ్వీర్ అక్కడ తను పోషించనున్న పాత్ర కోసం భారీగానే కసరత్తులు చేశారట. కపిల్‌దేవ్ మేనరిజమ్స్, స్టైల్స్‌ని ఒంటపట్టించుకున్న రణ్వీర్ తాజాగా 83 చిత్రానికి సంబంధించిన తన రెట్రో లుక్‌ను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో కపిల్ తరహాలో జులపాలతో రణ్వీర్ లుక్ ఆట్టుకుంటోంది. ఈ రెట్రో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.













