పుష్ప2 లో రణవీర్?
సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ఇచ్చిన బూస్ట్ తో సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నాడు బన్నీ. పుష్ప-2 పై అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా దీన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. దాదాపు వెయ్య కోట్ల టార్గెట్ తో రిలీజ్ కాబోతున్న పుష్ప2 సినిమాకు బాలీవుడ్ హంగులు అద్దే ప్రయత్నం చేస్తున్నాడు సుక్కూ భాయ్.
ఇప్పటికే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ భామతో ఐటెం సాంగ్ చేయించాలని డిసైడైన మేకర్స్ దాంతో పాటుగా మరికొంత మంది బాలీవుడ్ నటుల్ని ఈ సినిమలో నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్.
రణవీర్ కనిపించేది సినిమాలే కాసేపే అయినా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని, రణవీర్ నటించడంతో బాలీవుడ్ లో పుష్ప2 క్రేజ్ కూడా పెరుగుతుందని మేకర్స్ చాలా బలంగా నమ్ముతున్నారట. ఇప్పటికే పుష్ప2 గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి. మరి వాటిలానే ఈ రూమర్ కూడానా లేక నిజంగానే ఈ సినిమాలో రణవీర్ నటిస్తున్నాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండగా, నిజంగా రణవీర్ నటిస్తే మాత్రం ఈ సినిమా సెన్సేషన్ గా నిలవడం ఖాయమనే చెప్పాలి. కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్సుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.













