బాడ్ టైమ్ తో ట్రావెల్ చేస్తున్న రణవీర్..
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో అంటే మొదటగా గుర్తొచ్చే పేరు రణవీర్ సింగ్. ఒకప్పుడు ఫుల్ గర్ల్ ఫాలోయింగ్ తో హడావిడిగా ఉండే రణవీర్ ఈ మధ్య కాస్త
సైలెంట్ అయ్యాడనే చెప్పాలి. ఈ హీరో సక్సెస్ స్పీడ్ చూసి బాలీవుడ్ కి మరో షారుక్ ఖాన్ వచ్చాడని అంతా అనుకున్నారు. షారుక్ తర్వాత అతని స్థానాన్ని రీప్లేస్ చేసే స్టార్ గా రణవీర్ పాపులర్ అయ్యాడు. ఈ హీరో కటౌట్ చూసి దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఇండస్ర్టీని ఏలేయడం ఖాయమన్నారు.
రణవీర్ లాంటి మరో నటుడు రావాలంటే మరో పదేళ్లు టైమ్ పడుతుందన్నారు సినీ విశ్లేషకులు. ఈ తరుణంలోనే రణవీర్ హాట్ బ్యూటీ అయిన దీపికా పాడుకొనే ని పెళ్లాడడం జరిగింది. ఈ అమ్మడిని పెళ్లి చేసుకున్నాక రణవీర్ రేంజ్ ఇంకాస్త పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ మాటలన్నీ గాలిలో కట్టిన మేడల్లాగే అయ్యాయి. తాజాగా రణవీర్ సింగ్ పరిస్థితి చాలా కన్ఫ్యూషన్ లో ఉందని చెప్పొచ్చు.
రణవీర్ సింగ్ ని ప్రెజెంట్ బ్యాడ్ టైమ్ బంతాడేస్తోందనే చెప్పాలి. ’83’ సినిమా నుంచి మొదలైన ప్లాప్ సీక్వెన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ’83’, ‘జయేష్ భాయ్ జోర్డర్’ వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. తర్వాత వచ్చిన ‘సర్కస్’ తో అయినా సక్సెస్ సాధించి ఫాంలో కి వస్తాడనుకుంటే, ఈసారి కూడా ఈ హీరోకి నిరాశే ఎదురయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని పొందలేకపోయింది.
రణవీర్ కి గత రెండేళ్లగా సక్సెస్ అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ హీరో సినిమాలన్ని వరుసగా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు కనీసం 30 కోట్లు తేవడం కూడా కష్టంగా మారిందని సమాచారం. ఈ నేపథ్యంలో రణవీర్ కి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని సమాచారం.













