భార్యను బుట్టలో వేసుకోవడం ఎలా?
ప్రేమకథకు పెళ్లితో శుభం కార్డు పడడం సినిమాల్లోనే కాదు. నిజ జీవితంలోనూ జరుగుతుంటుంది. కానీ రణవీర్-దీపికల ప్రేమ కథ మాత్రం పెళ్లయ్యాక కూడా కొనసాగుతూనే ఉంది. దీపికపై తనకు గల ప్రేమను రణవీర్ ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. తాజాగా తన భార్య దీపికకు అతను ఏకంగా ఓ ప్రేమలేఖనే రాశాడు. దీపికలాంటి ఓ స్త్రీమూర్తిని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని, ఆమె తన భార్య కావడం తన అదృష్టమని ఆ లేఖలో అతను పేర్కొన్నారు. దయ, దాతృత్వం, తెలివి, తెగువ, సౌందర్య, సౌజన్యం వంటి అద్భుత గుణాల మేలు కలయిక దీపిక అంటూ ఆమెను అకాశానికెత్తాశాడు. చూస్తుంటే పెళ్లాంను బుట్టలో వేసుకోవడంలో రణవీర్ సిద్దహస్తుడైపోయేలా ఉన్నాడు.













