దీపికకి 120 కోట్ల విలువ చేసే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రణవీర్…!
బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ దీపికా పదుకనే, రణవీర్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూనే ఉంటారు. ఆ మధ్య వీరిద్దరూ విడిపోయారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ వీరిద్దరిది విడిపోయేంత వీక్ బంధం కాదని మరోసారి నిరూపించారు ఈ జంట. ఈ ఇద్దరి రిలేషన్ షిప్ అపురూపం అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటూ ఉంటారు.
రణవీర్, దీపికా ఈ ఇద్దరు కూడా బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా దూసుకు పోతున్నారు. వారి వారి కెరీర్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు. ఏడాదికి వంద కోట్ల వరకు ఆదాయం కలిగి ఉన్న ఈ జంట ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియాలో నిర్మించిన ప్రత్యేక ఇంట్లో కొత్త సంవత్సరం సందర్భంగా అడుగు పెట్టబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
దీపికా అభిరుచికి తగ్గట్లుగా 11266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంద్రభవనం వంటి ఇంటిని రణవీర్ సింగ్ రెడీ చేయించాడట. దాదాపు రెండు మూడు నెలలు ప్రత్యేకంగా ఈ హీరో శ్రద్ద పెట్టి ఈ ఇంటిని ఫినిషింగ్ చేయించాడు అంటూ ఆయన సన్నిహితులు బాలీవుడ్ మీడియా వద్ద చెప్పుకొచ్చారు.
ఈ ఇంటి కోసం రణ్వీర్ సింగ్ ఏకంగా 119 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని వారు చెబుతున్నారు. రణవీర్ నిర్మించిన ఈ ఇంద్రభవనం స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ ఇళ్లకు సమీపంలో ఉంటుందట. ఈ ఇంటికి అద్భుతమైన టెర్రస్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ ఉండి అత్యంత విలాసంగా ఉంటుందట. ప్రతి మూల కూడా అత్యాధునిక హంగులను మరియు అధునాతన ఇంటీరియర్ తో డిజైన్ చేయించినట్లుగా తెలుస్తోంది.
దాదాపు 120 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఇంద్రభవనం వంటి ఇల్లును కొత్త సంవత్సరం గిఫ్ట్ గా తన భార్య అయిన దీపికా కు రణవీర్ సింగ్ అందిస్తున్నారట. ఈ జంట న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎంతో అపురూపంగా కట్టుకున్న కొత్త ఇంట్లో చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.













