రణ్‌బీర్ జోడీగా శ్రద్ధా కపూర్!
స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికలు ఒకే కావడం అంత ఈజీ కాదు. ఓ కథానాయికని అనుకున్నాక కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. హీరోయిన్ షూటింగ్లో పాల్గొనేంత వరకు ఓ క్లారిటీ రాదు. చివరి నిమిషంలో కథానాయికలు మారిపోతుంటారు. అలాంటి పరిస్థితి రణ్‌బీర్ కపూర్, అజయ్ దేవగన్ హీరోలుగా రూపొందే చిత్రానికి ఎదురైంది. లవ్ రంజాన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మొదట కథానాయికగా దీపిక పదుకొనెని ఎంపిక చేశారు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి దీపికా తప్పుకున్నారు. దీంతో ఆ ఛాన్స్ ఇప్పుడు శ్రద్ధా కపూర్‌కి వరించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో కథానాయికగా శ్రద్దా కపూర్‌ని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయి. శ్రద్దా ఇందులో నటించేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సెట్ అయితే రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్లకిది తొలి చిత్రమవుతుంది. గతంలో వీరిద్దరు కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించారు. కానీ సినిమాలు చేయలేదు. మొదటిసారి జోడీ కట్టబోతున్నారని చెప్పొచ్చు.













