14న దీపిక-రణవీర్ పెళ్లి
బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ పెళ్లికి ముహుర్తం కుదిరింది. ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ విషయాన్ని దీపికా, రణవీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల ఆశీస్సులతో వచ్చే నెల 14, 15న మేమిద్దరం ఒకటి కాబోతున్నాం అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం మీరు మాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. ప్రేమ, స్నేహం, నమ్మకంతో మేమిద్దరం చెయ్యబోతున్న కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. ప్రేమతో మీ దీపిక, రణ్వీర్ అని రాసి ఉన్న ఇన్విటేషన్‌ను ట్విట్టర్లో షేర్ చేసిందీ జంట. దీప్‌వీర్‌ల పెళ్లి గురించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులు ఈ విషయం తెలుసుకుని సంబరపడిపోయారు.













