మా పెళ్లికి సెల్ ఫోన్లు వద్దు !
రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి నవంబర్ 20న ఇటలీలోని కోమో సరస్సు వేదికగా జరగనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుకకు 30 మంది ఎంపిక చేసిన అతిధులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లనున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న దీప్ వీర్ జంట ముంబైలో రిసెప్షన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వరలో నిశ్చితార్థంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయనున్నారని అంటున్నారు. అయితే వీరి వివాహ వేడుకకు సెల్ ఫోన్లు అనుమతించకూడదని కూడా ఈ జంట నిర్ణయించారట. వేడుక అనంతరం వీరిద్దరే వివాహ ఫోటోలను అందరికీ షేర్ చేయాలని భావించారట. ఈ కారణంగా మా పెళ్లికి సెల్ఫోన్లు తీసుకురావద్దంటూ అతిథులకు దీపికా, రణ్వీర్ చేబుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని కూడా వీరు అభిప్రాయపడుతున్నట్టు సమచారం.













