Rani Mukerji: అలా అంటే అవార్డు వచ్చినా విలువ ఉండదు

ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులుంటారు. కానీ వారిలో కొంతమందికే బెస్ట్ నటులుగా అవార్డులొస్తాయి. బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ(Rani Mukerji) రీసెంట్ గా కెరీర్లోనే మొదటి సారి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. నేషనల్ అవార్డు అందుకున్న నేపథ్యంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
2023లో రిలీజైన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే(Mrs. Chatterjee vs Norway) మూవీకి రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకోగా, ఆ అవార్డు రావడంతో నటిగా తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె చెప్పారు. ఏదైనా అవార్డు వచ్చినప్పుడు దానికి మనం అర్హులమని ఆడియన్స్ కూడా భావిస్తే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేమని రీసెంట్ గా ఆమె చెప్పుకొచ్చారు.
అలా కాకుండా ఆమె యాక్టింగ్ కు అవార్డు వచ్చిందా? ఆమె కంటే బెటర్ గా చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు కదా అని కామెంట్స్ వినిపిస్తే అవార్డు వచ్చినప్పటికీ దానికి విలువ ఉండదని, తనకు నేషనల్ అవార్డు రావడాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారని, అందరి అంగీకారమే తనకు అవార్డు కంటే గొప్పగా అనిపించిందని రాణీ ముఖర్జీ కామెంట్ చేశారు.