రంగస్థలం మరో రికార్డు!
రంగస్థలం కలెక్షన్ల హవా కొనసాగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సమంత కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పుడు ఓవర్సీస్లోనూ మరో రికార్డును సృష్టించింది. కలెక్షన్ల పరంగా బాహుబలి చిత్రాల తర్వాత అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. ఇప్పటివరకూ ఈ చిత్రం 3,256,663 డాలర్లు ( రూ.21.26 కోట్లు) వసూలు చేసినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.













