‘రంగస్థలం’ టీజర్ విడుదల
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రంగస్థలం 1985’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించగా జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. గత చిత్రాల కంటే ఈ మూవీలో రామ్ చరణ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్ వినపడిద్దండి. నాకు సౌండ్ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్ ఇంజనీరు’ అంటారు’’ అని అంటున్నారు రామ్చరణ్. చెవిటి వ్యక్తిగా చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టాడు. పల్లెటూరి నేపథ్యంలో అందమైన ప్రేమ కథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కినట్టు తెలుస్తుంది. 1985 నాటి కాలాన్ని తలపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.













