తమిళ్లో `రంగస్థలం`.. చిట్టిబాబు క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది?
రామ్‌చరణ్ కెరీర్లో `రంగస్థలం` చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అతని క్యారెక్టర్ పరంగా, లుక్ పరంగా, ఆ సినిమా సాధించిన సక్సెస్‌పరంగా ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. చరణ్ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ అలాంటి క్యారెక్టర్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఆ సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. మరి ఈ సినిమా మరో భాషలో రీమేక్ చెయ్యాలంటే కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిట్టిబాబు క్యారెక్టర్‌ను ఎవరు చేస్తే బాగుంటుంది అనే విషయంలో తప్పకుండా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఇప్పుడిదే సమస్య కోలీవుడ్‌లో వచ్చింది. నిజానికి రంగస్థలం చిత్రం తమిళ నేటివిటీ సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమాను యధాతథంగా తమిళ్లోకి డబ్ చేసినా డైరెక్ట్ సినిమా అనే అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే చిట్టిబాబు క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందనే డిస్కషన్ వచ్చినపుడు లారెన్స్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో లారెన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మరోపక్క మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్‌లా పెర్ఫార్మ్ చెయ్యడం లారెన్స్ వల్ల కాదని కొట్టిపారేస్తున్నారు. ఏ క్యారెక్టర్ అయినా చేసి రక్తి కట్టించగల సత్తా లారెన్స్‌లో ఉంది. ఆ నమ్మకంతోనే చిత్ర యూనిట్ లారెన్స్‌ని సంప్రదించినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా ఏ బేనర్లో నిర్మించనున్నారు, దర్శకుడు ఎవరు అనే విషయాలు బయటికి రాలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.













