నితిన్ ‘రంగ్‌దే’ కి ఓటిటి నుండి ఫాన్సీ ఆఫర్
లాక్డౌన్ 5.0లో థియేటర్స్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దసరాకు థియేటర్స్ ఓపెన్ అవుతాయన్న గట్టి నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. దీంతో ఓటీటీ సంస్థల్లో భయం మొదలై పోయింది. లాక్డౌన్ సమయంలో ఓటీటీ చిన్న సినిమాలకు దేవుడిలా కనిపించింది. పెట్టుబడి రావడమే కాదు.. లాభం వచ్చేలా చిన్న చిత్రాలను కొనుకోలుచేసి నిర్మాతల ఇబ్బందులు తీర్చింది. లాక్డౌన్ 4లో కూడా థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు రాకపోవడంతో క్రేజీ మూవీ ‘వి’ ఓటీటీని ఆశ్రయించింది. త్వరలో అక్టోబర్ 2న నిశ్శబ్దం.. ఒరేయ్ బుజ్జిగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. ఇంకా సోలో బతుకే సో బెటర్ కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. దసరానాటికి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండటంతో క్రేజీ మూవీస్ నిర్మాతలు ఓటీటీ వైపు చూడడం మానేస్తారు. హైప్ ఉన్న మూవీ విడుదల అయితేనే..ఓటీటీలో సబ్ స్క్రైబర్స్ పెరుగుతారు.
ఈ క్రమంలో.. ఓటీటీలు పెద్ద సినిమాలకు వల వేస్తున్నాయి. వకీల్‌సాబ్ నిర్మాతలను ఓటీటీలు సంప్రదింపులు జరిపాయన్న టాక్ నడిచింది. డిజిటల్ అనే కాకుండా.. శాటిలైట్.. హిందీ అనువాదంతో కలిపి 100 కోట్ల ఆఫర్ చేశారట. ఓటీటీల ఆకర్ష్ పథకంలో భాగంగా.. నితిన్ నటిస్తున్న రంగ్‌దే నిర్మాతను ఎట్రాక్ట్ చేశారు. నితిన్, కీర్తిసురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్‌దే టీజర్‌కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెలలో షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ఓటీటీల వైపు నిర్మాతలు చూడరు. అందుకే.. ఇప్పడే కర్చీఫ్ వేసేసి బుక్ చేసేసుకునే పనిలో ఓ డిజటల్ ఫ్లాట్‌ఫామ్ 40 కోట్లు ఆఫర్ చేసిందట. ఇలా సంక్రాంతికి రిలీజ్ అని చెబుతున్నా.. క్రేజీ మూవీస్ థియేటర్స్‌లోకి వెళ్లకుండా.. ఫ్యాన్సీ ఆఫర్‌తో మాయ చేసేలా డిజిటల్ వ్యాపారం నడుస్తోంది. మొత్తానికి రంగ్ దేకు ఓటీటీ మంచి ఆఫరే ప్రకటించి ఆ చిత్ర యూనిట్ లో ఆశలు రేపుతోంది.













