రణ్‌బీర్ నోట బాలయ్య డైలాగ్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో కోసం ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ షోకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రావడమే దీనికి కారణం. రణ్‌బీర్ లాంటి పెద్ద స్టార్ బాలయ్యతో సందడి చేయడంతో ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రణ్‌బీర్‌తో పాటూ యానిమల్ మూవీ హీరోయిన్ అయిన రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికీ పూర్తయింది. అందుకే ఎపిసోడ్ స్ట్రీమింగ్ కంటే ముందే లీక్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
లీక్స్ ప్రకారం, బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌ను కూడా రణ్‌బీర్ చెప్పాడని తెలుస్తోంది. బాలయ్య హిట్ డైలాగ్స్ లో ఒకటైన ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అనే డైలాగ్‌ను రణ్‌బీర్ చెప్తూ షోలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ డైలాగుతో షోకు మంచి కిక్ రానుందని ఎపిసోడ్ ను చూసినవారు చెప్తున్నారు. యానిమల్ సినిమా డిసెంబర్ 1న బాలీవుడ్‌తో పాటూ టాలీవుడ్లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.













