కోహ్లీ బయోపిక్‌పై రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
50 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ పేరు క్రికెట్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ రికార్డును మళ్లీ రీక్రియేట్ చేయడం ఇప్పట్లో ఏ క్రికెటర్‌కీ సాధ్యం కాని పని. సచిన్, ధోనిని దాటి కోహ్లీ పాపులర్ క్రికెటర్‌గా మారాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది.
యానిమల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ కు వచ్చిన రణ్‌బీర్ కపూర్‌కు కోహ్లీ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. విరాట్ బయోపిక్ లో మీరు నటించాలనుకుంటున్నారా అని అడగ్గా, దానికి రణ్‌బీర్ ఆసక్తికర సమధానమిచ్చాడు. విరాట్ లైఫ్ ను మూవీగా తీస్తే అందులో అతనే నటించాలి. అందరికంటే విరాట్ చాలా అందంగా ఉంటాడు. మంచి ఫిట్ గా కనిపిస్తాడు. అందుకే తన పాత్రను తనే పోషించాలని చెప్పాడు.
రణ్‌బీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మామూలుగా వేరే ఎవరికైనా ఈ ప్రశ్న ఎదురైతే తప్పకుండా అనే ఆన్సర్ వస్తుంది. కానీ రణ్‌బీర్ మాత్రం భిన్నంగా ఆన్సర్ ఇచ్చాడు. విరాట్ బయోపిక్ లో నటించడానికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, రామ్ పోతినేని ఇద్దరూ ఇప్పటికే ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు తమ అభిప్రాయాన్ని తెలపగా ఇప్పుడు రణ్‌బీర్ మాత్రం కోహ్లీనే ఆ బయోపిక్ చేయాలని చెప్తున్నాడు. మరి తన బయోపిక్‌లో కోహ్లీ నటిస్తాడా లేక ఆ ఛాన్స్ ను ఇంకెవరికైనా ఇస్తాడా అన్నది చూడాలి.













