‘ఆహా’ బ్లాక్ బస్టర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌భీర్ కపూర్”
తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందిస్తోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ ఆహా. ఇందులో బ్లాక్ బస్టర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరికొత్త ఫార్మేట్లో ప్రారంభమైన ఈ టాక్‌షో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించటమే కాదు.. రేటింగ్స్ పరంగానూ టాప్‌లో కొనసాగుతోంది. ఐఎండీబీలో టాప్ టాక్ షోగా ర్యాకింగ్ సంపాదించుకోవటం తెలిసిన సంగతే. ఎన్నో సంచనాలను సృష్టించిన ఈ టాక్‌షో ఇప్పుడు మరిన్ని అదనపు హంగులతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైంది. అందులో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌భీర్ కపూర్ ఈ టాక్‌షోకు అతిథిగా రాబోతున్నారు. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతినిచ్చే ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లటానికి సిద్ధమైంది.
నవంబర్ 4, 2021లో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఈ టాక్ షోకి తిరుగులేని ఆదరణ దక్కింది. రేటింగ్స్ పరంగా అగ్రపథాన నిలుస్తూ టాప్ రేంజ్‌కి చేరింది. ఆహాలో అత్యధికంగా వీక్షించిన ప్రోగ్రామ్‌గా ఇది నిలిచింది. ఇప్పటి వరకు 550 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో చెరగని ముద్ర వేసింది. ప్రారంభ సీజన్లో మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, రానా దగ్గుబాటి తదితరులు గెస్టులుగా విచ్చేశారు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తొలి సీజన్‌కి వచ్చిన రెస్పాన్స్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ప్రారంభించిన రెండో సీజన్లో ప్రముఖ రాజకీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా పాల్గొనటంతో టాక్ షో మరింతగా దూసుకెళ్లింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటి వారు కూడా భాగమయ్యారు. ఇలా ఓ వైపు సినీ అగ్ర తారలు, ప్రముఖు పొలిటికల్ లీడర్స్ కాంబినేషన్లో ఈ టాక్ షో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఈ టాక్ షో సెకండ్ సీజన్ ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందనను రాబట్టుకోవటమే కాదు 850 స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది.
రోజు రోజుకీ ఆదరణను పెంచుకుంటూ దూసుకెళ్తోన అన్‌స్టాపబుల్ టాక్‌షో అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ షోలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సెన్సేషనల్ టాక్ షోలో బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సూపర్‌స్టార్ రణ్‌భీర్ కపూర్ పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, విజనరీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా పాల్గొంటున్నారు. ఈ స్టార్స్ నటించిన యానిమల్ సినిమాను ప్రమోట్ చేయటంలో భాగంగా అన్‌స్టాపబుల్ స్పాట్ లైట్లో భాగమవుతున్నారు. మరచిపోలేని టాలెంట్, చరిష్మా, ఎంటర్టైన్మెంట్ల కలయికలో హద్దులను చేరిపేసేలా, సరికొత్త ప్రమాణాన్ని సృష్టించేలా ఈ అద్భుతమైన టాక్ షో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధంగా ఉంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో ఈ మ్యాజిక్‌ని ఆహాలో వీక్షించటానికి రెడీగా ఉండండి.













