బాలీవుడ్ భీష్మ కన్ ఫర్మ్
భీష్మ ది బ్యాచిలర్ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అందుకే బాలీవుడ్‌లోనూ రీమేక్ కాబోతున్నాడు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీష్మ. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీల్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో రణ్‌బీర్ కపూర్ యాక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలీవుడ్ భీష్మ కన్ ఫర్మ్ అయ్యారట. ఈ సినిమాలో హీరోగా అర్జున్ కపూర్ నటించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.













