రజినీ సినిమాలో ఏడిపించనున్న రానా
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ డైరెక్షన్ లో రజినీ170వ సినిమాగా వేట్టయాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని రజినీ తన తర్వాతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రజనీతో అవసరం లేని షూటింగ్ ను కూడా పూర్తి చేసి మొత్తానికి వేట్టయాన్ ను కంప్లీట్ చేశాడు జ్ఞానవేల్.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న వేట్టయాన్ సినిమాకు రీసెంట్ గా మంజు వారియర్ తన డబ్బింగ్ ను కూడా పూర్తి చేసింది. వేట్టయాన్ లో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా కీలకపాత్రలు చేస్తుండగా, ఇంకా వీరి పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ మొదలుకానట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
వేట్టయాన్ సినిమా వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిందని లీకులందుతున్నాయి. ఈ సినిమాలో రజినీ పోలీస్ పాత్ర నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన నుంచే తీసుకున్నట్లు సమాచారం. నిజాయితీ గల పోలీస్ అధికారి విషయంలో సమాజం తీరుని ప్రశ్నిస్తూ ఆ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తున్నారట. అంతేకాదు సినిమాలో రానా పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంటుందని, ఆ పాత్ర ముగింపు ఆడియన్స్ ను చాలా ఎమోషనల్ చేస్తుందని, ఆ సీన్ కు ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టడం ఖాయమని అంటున్నారు. వేట్టయాన్ అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది.













