నెక్ట్స్ లెవెల్లో రానా విలనిజం
బాహుబలి సినిమాలో భల్లాలదేవగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన రానా కెరీర్ ను ఆ సినిమా పూర్తిగా మార్చేసింది. హీరోగా రాని పాపులారిటీ రానాకు విలన్ గా బాహుబలి సినిమాతో వచ్చింది. బాహుబలి తర్వాత విలన్ క్యారెక్టర్ కు బెస్ట్ ఆప్షన్ గా మారిన రానా తన ఎదురు బలమైన స్టార్ హీరో ఉంటే తప్ప విలన్ క్యారెక్టర్స్ చేయనని కుండబద్దలు కొట్టి చెప్పేశాడు.
ఈ నేపథ్యంలోనే రానా, ఇప్పుడు మెగాస్టార్, వశిష్ఠ కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ విశ్వంభరలో రానా క్యారెక్టర్ కు సంబంధించిని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో రానా విలనిజం నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, రానా గెటప్ ను కూడా హాలీవుడ్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయి డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
చూస్తుంటే ఈ సినిమా రానా కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే విశ్వంభరలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని, ఇప్పటికే ఒక హీరోయిన్ గా త్రిషను కన్ఫర్మ్ చేశారని టాక్. మిగిలిన హీరోయిన్లు కూడా ఫిక్స్ అయ్యాక మంచి టైమ్ చూసుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.













