రానా ఆ రిస్క్ చేస్తాడా?
డైరెక్టర్ తేజ ఎంత డిజాస్టర్ కెరీర్ ని రన్ చేస్తున్నాడో తెలిసిందే. తను రీసెంట్గా తీసిన అహింస సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందింది. ఒకప్పుడు కొత్త హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తేజకు ఇప్పుడు హీరోలు ఆఫర్లే ఇవ్వని పరిస్థితి. కానీ సురేష్ ప్రొడక్షన్స్ కు మాత్రం తేజ అంటే విపరీతమైన నమ్మకం.
దానికి కారణం నేనే రాజు నేనే మంత్రి సక్సెస్. ఆ సినిమా ఏమీ పెద్ద రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ రానా సోలో హీరోగా వచ్చి మంచి సక్సెస్ అయిన సినిమా అదే. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కాంబోలో రాక్షస రాజు అనే సినిమా రాబోతున్నట్లు తేజ స్వయంగా వెల్లడించాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో వర్తమాన రాజకీయాల గురించి చాలా వివాదాస్పద అంశాలుంటాయని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. రాక్షస రాజు సినిమాను రెండు భాగాలుగా తీసే ప్లాన్ లో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. స్టోరీ ఎంత బాగున్నా సరే తేజ మీద నమ్మకంతో ఇది రెండు పార్ట్‌లుగా తీయడమంటే రిస్క్ అనే చెప్పాలి. ఒక వేళ ఫస్ట్ పార్ట్ తేడా కొడితే సెకండ్ పార్ట్ ని డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను పూడ్చడానికే అమ్మాల్సి వస్తుంది తప్పించి మరో ఉపయోగముండదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి రానా ఆ రిస్క్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.













