రజినీ మూవీలో రానా
జైలర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్ తన 170వ సినిమాను జై భీమ్ ఫేమ్ టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ మూవీలో ఓ క్యారెక్టర్ కోసం టాలీవుడ్ యంగ్ హీరోలు నాని, శర్వానంద్‌లను కూడా సంప్రదించినప్పటికీ, ఆ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉండటంతో ఆ ఇద్దరూ ఈ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశారు.
దీంతో ఇప్పుడా అవకాశం టాలీవుడ్ భల్లాళదేవుడు రానా దగ్గుబాటిని వరించినట్లు తెలుస్తోంది. సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాలోని క్యాస్టింగ్‌ను ఇప్పటికే డైరెక్టర్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ కూడా నటిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో కూడా దర్శకుడు జ్ఞానవేల్, ఓ సీరియస్ ఇష్యూని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఫేక్ ఎన్కౌంటర్ల ద్వారా అమాయకుల ప్రాణాలు ఎలా బలవుతున్నాయో అ మూవీలో చూపించనున్నారట. అంతేకాదు ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో కూడా చూపించబోతున్నాడట జ్ఞానవేల్.
సినిమాలోని కథ ఎంత సీరియస్ గా సాగిన రజినీ మార్క్ హీరోయిజం, ఎలివేషన్లు మిస్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. ఇలాంటి డిఫరెంట్ సినిమాలో రానా కు ఛాన్స్ దక్కిందంటే ఇక తన నట విశ్వరూపం కూడా బయటపెడతాడు. ఈ మూవీ రానా కెరీర్ కు ఎంతలా ఉపయోగపడుతుందన్నది చూడాలి.













