మరో బాలీవుడ్ మూవీకి రానా గ్రీన్ సిగ్నల్
దగ్గుబాటి రానా హీరోగా తెలుగులో చివరిగా వచ్చిన సినిమా విరాట పర్వం. ఆ తర్వాత తన బాబాయి విక్టరీ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశాడు. విరాటపర్వం తర్వాత 1945 రిలీజైంది కానీ అది తమిళ్ డబ్బింగ్ మూవీగా వచ్చింది. తర్వాత నిఖిల్ స్పై లో గెస్ట్ రోల్ చేశాడు. ప్రస్తతుం రజినీకాంత్ వేట్టయాన్ లో కీలకపాత్ర చేస్తున్న రానా, ఆ తర్వాత తేజతో కలిసి రాక్షసరాజా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
ఇప్పటికే రానా నాయుడు సీజన్2 షూటింగ్ ను పూర్తి చేసుకున్న రానా, త్వరలోనే తేజ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే రానా హిందీలో ఓ సినిమాలో విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానా హిందీలో పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు షాహిద్ కపూర్ టైటిల్ రోల్ లో తెరకెక్నున్న ఛత్రపతి శివాజీ సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటించడానికి రానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
OMG2 ఫేమ్ అమిత్ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పీరియాడిక్ జానర్ లో హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు, వాకూ ఫిల్మ్స్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాహుబలి తర్వాత రానా చేచబోయే పీరియాడికల్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇదే కానుంది.













