హారర్ కథతో రానున్న రానా
బాహుబలి సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. అయితే రానా హీరోగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాయి. ప్రతీసారి కొత్తగా ట్రై చేయడానికి పరితపించే రానా ఇప్పుడు కొన్ని క్రేజీ కథలను లైన్ లో పెట్టాడు.
ప్రస్తుతం రానా నాయుడు2 సిరీస్ లో నటిస్తున్న రానా, బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారు. చాలా కాలం నుంచి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాతో కిషోర్ అనే కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ దసరా తర్వాత మొదలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రానాకు జోడీగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించనుంది. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ తో పాటూ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కూడా ఉంటాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు రానా, తేజ దర్శకత్వంలో రాక్షస రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.













