అమెరికా నుంచి రానా వస్తున్నాడు
యువ కథానాయకుడు దగ్గుబాటి రానా అమెరికా నుంచి తిరిగొస్తున్నారు. మరో 72 గంటల్లో తాను భారతదేశంలో అడుగు పెట్టబోతున్నానని ఆయన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. కొన్నాళ్లుగా ఆయన అమెరికాలోనే గడుపుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురి కావడంతో, చికిత్స కోసమే ఆయన అక్కడికి వెళ్లారని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొన్నాయి. రానా అమెరికా వెళ్లినప్పటికీ ఆయన నటిస్తున్న చిత్రం విరాటపర్వం సినిమా చిత్రీకరణ ఇక్కడ జరుగుతోంది. ఇతర నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రానా తిరిగొచ్చాక ఆయనపై సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. గుణశేఖర్ తెరకెక్కించే హిరణ్య చిత్రంపైనా రానా దృష్టి సారించే అవవకాశాలున్నాయి.













