ఒకే ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న రానా, చైతూ
దగ్గుబాటి రానా, అక్కినేని నాగచైతన్య. వీరిద్దరి బంధం గురించి కొత్తగా, ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ బావ బావమరిది మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్స్ కూడా. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చేస్తారు. అలాంటి వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు పని చేసింది లేదు. కానీ ఇప్పుడు వారిద్దరూ ఓ ప్రాజెక్ట్ కోసం కలిశారు.
రానా, చైతూ ఇద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఎవరికీ తెలియకుండా ఓ ప్రాజెక్ట్‌ని కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈ ఇద్దరూ కలిసింది మూవీ కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. వీరిద్దరూ కలిసి ఒక కొత్త బ్యానర్ ని స్టార్ట్ చేసి మాయాబజార్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే వీరిద్దరూ కలిసి ఏ ప్లాట్‌ఫామ్‌కు పని చేస్తున్నారనేది ఇంకా బయటకు రాలేదు కానీ ఆల్రెడీ ఓ సంస్థతో డీల్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. వీరిద్దరూ ఇన్వాల్వ్ అయిన ఈ సిరీస్‌లో చైతూ కానీ, రానా కానీ నటించరు. ఆ సిరీస్‌కు వారు జస్ట్ కంటెంట్ ప్రొడ్యూసర్స్ మాత్రమే.
ఇప్పటికే రానా వెబ్ సిరీస్‌లతో ఓటీటీలోకి దిగగా, చైతూ ధూత అనే సిరీస్‌లో నటించాడు. రానా ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించగా, చైతూకి మాత్రం ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మాయాబజార్ సిరీస్ గురించి త్వరలోనే మిగిలిన వివరాలు బయటకు రానున్నాయి.













