రానా ఇక మారడా?
లీడర్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన రానా దగ్గుబాటి మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ అవేమీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో విభిన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు రానా.
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా, తర్వాత ఘాజీ సినిమాతో తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. ఇక మొన్నీమధ్య పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించాడు. కానీ రానా కెరీర్ ఇలా పరిమితమవ్వడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఎన్ని రోజులని ఇలా వేరే హీరోల సినిమాల్లో నటిస్తారని ప్రశ్నిస్తున్నారు.
దీంతో విషయం అర్థం చేసుకున్న రానా ఇక నుంచి తన నుంచి అందరూ ఎలాంటి సినిమాలనైతే కోరుకుంటారో అలాంటి సినిమాలే వస్తాయని క్లారిటీ ఇచ్చాడు. కొన్ని రోజులు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అవేమీ ఫలించకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాత పద్ధతినే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానా, రజినీ170 సినిమాలో ఓ క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొదట్లో ఆ రోల్ కోసం నానిని సంప్రదించినప్పటికీ, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో నాని దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడని, దీంతో ఆ క్యారెక్టర్ రానాకు దక్కిందని టాక్.













