నేను పెళ్ళిచేసుకునే అమ్మాయి మిహికా బజాజ్ – రానా దగ్గుబాటి
ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓ సంచలన బాంబు బ్లాస్ట్ వార్త పేల్చాడు రానా దగ్గుబాటి . త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు.. తనకు కాబోయే భార్య ఫొటోను కూడా బయటపెట్టాడు. అవును.. భళ్లాలదేవుడు పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఆమె కాబోయే భార్య పేరు మిహికా బజాజ్.
ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త బంటీ బజాజ్ కూతురు ఈమె. ఈమెకంటూ ప్రత్యేకంగా ఇంటీరియర్ బిజినెస్ లు ఉన్నాయి. వ్యాపార నిమిత్తం నిత్యం హైదరాబాద్, ముంబయి మధ్య ఈమె చక్కర్లు కొడుతూ ఉంటుంది. రానాకు, ఈమెకు ఎక్కడ పరిచయమైంది. ఎన్నాళ్ల నుంచి వీళ్లు ప్రేమించుకుంటున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు రానా. అంతేకాదు.. ఇతడి పర్సనల్ లైఫ్ చుట్టూ అల్లుకున్న గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా హీరోయిన్ త్రిషతో రానాను లింక్ చేస్తూ ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ రూమర్లు అలా నడుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ లో రానా, మిహికా పెళ్లితో ఒకటి కాబోతున్నారు.
ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసాడు రానా దగ్గుబాటి. ఈ పోస్ట్ ప్రతి స్పందనగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ ప్రభాస్ ఇలా టాలీవుడ్ ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు. బాహుబలి చిత్రం తో బాలీవుడ్ కు కూడా పరిచయం కావడంతో బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు యావత్ భారత సినీ పరిశ్రమ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ ట్వీట్ కు 6,500 కామెట్స్ వచ్చాయి.
ప్రస్తుతం విరాటపర్వం సినిమా చేస్తున్నాడు రానా. అతడు నటించిన అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాడు.













