చిరూ సినిమాలో రానా
రానా కెరీర్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పాలి. మొదట్లో హీరోగా ట్రై చేసిన రానా, అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో హీరోగా చేస్తూనే మరోవైపు మిగిలిన హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రానా బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించాడో అప్పటినుంచి తన పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపించడం మొదలైంది.
రకరకాల పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న రానా, రీసెంట్గా రజినీకాంత్ మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రానా, మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. అది మరేదో కాదు, మెగాస్టార్ చిరూ చేయబోతున్న మెగా156.
బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో చిరూ చేయబోతున్న సినిమాలో రానా విలన్ గా నటించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. విలన్ పాత్రలో రానా అద్భుతమైన నటన ప్రదర్శించగలడు కానీ చిరూతో ఉన్న అనుంబంధం దృష్ట్యా రానాను చిరూకి విలన్ గా అంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదే అనుమానంగా ఉంది.













