13న వస్తున్న వెంకీ మామ
మేనమామ వెంకటేశ్‌తో కలిసి ఆయన మేనల్లుడు నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా వెంకీమామ. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రమిది. ఇందులో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. నాగచైతన్య, రాశీ ఖన్నా పుట్టినరోజులకు వారి టీజర్స్ విడుదల చేశాం. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు అద్భుత స్పందన లభించింది. అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటుంది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత.













