తన స్టామినాను ప్రూవ్ చేసుకున్న రామ్
ఈ వారం రిలీజ్ అయిన స్కంద సినిమాకు అన్ని సినిమాల్లాగా ముందే అడ్వాన్స్ బుకింగ్స ఓ రేంజ్ లో జరగలేదు. చాలా చోట్ల వినాయక నిమజ్జనం ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి తోడు స్కందకు మినిమం బజ్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ కూడా బుకింగ్స్ పైన పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్కంద డే1 18 కోట్లకు పైగా గ్రాస్ తో, 8.60కోట్ల షేర్ ను రాబట్టిందంటే మాటలు కాదు. దీంతో రామ్ రియల్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు మొదటి ఆట తర్వాత డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మాటలు కాదు. అదే ఒకవేళ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి.
స్కంద బ్రేక్ ఈవెన్ కావాలంటే 44 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దాన్ని చాలా ఈజీగా దాటేస్తామని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అదే నిజమైతే రామ్ మార్కెట్ నెక్ట్స్ సినిమాకు మరింత పెరగడం ఖాయం. ఏదేమైనా టైర్2 హీరోల్లో తన పొజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉందని రామ్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో పాటూ రిలీజ్ అయిన చంద్రముఖి2, పెదకాపు1 సినిమాలకు కూడా టాక్ అంతంతమాత్రంగానే రావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశముంది.













