రమేష్ వర్మ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్?

‘వకీల్‌సాబ్’ చిత్రంలో టాలీవుడ్‌లోకి సాలిడ్‌గా రీఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రవితేజా తో వీర, ప్రస్తుతం ఖిలాడీ చిత్రాల దర్శకుడికి కూడా పవన్ ఓ సినిమా చేస్తున్నారట. మూడు సంవత్సరాల పాటు తెలుగు తెరకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జోష్ ఏమాత్రం తగ్గలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో ఆయన ‘హరిహర వీరమల్లు’, ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. అనంతరం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, బండ్ల గణేశ్ నిర్మాణంలో మరో సినిమాకి కూడా పవన్ ఓకే చెప్పారని టాక్.
ఇక లేటెస్ట్‌గా మరో క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఆయన రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’, ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజాతో ‘ఖిలాడీ’ సినిమాలు రూపొందిస్తున్న రమేశ్ వర్మతో పవన్ త్వరలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రమేశ్ వర్మ పవన్‌కు కథ వినిపించగా.. ఆయన దాన్ని ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం సినిమా వాయిదాపడింది. ఇక పవన్‌కళ్యాణ్ కూడా ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పవన్ మళ్లీ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. క్రిష్ సినిమా, అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్‌లు చేసిన తర్వాత పవన్, రమేశ్ వర్మ సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొంటారు. అయితే ఈ నెలలోని సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించి, అక్టోబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.