రెండు భాగాలుగా గేమ్ చేంజర్? రిస్క్ అవసరమా?
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గేమ్ చేంజర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్త ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ ఈ వార్త మాత్రం చాలా పెద్ద చర్చకే దారి తీస్తోంది.
వాస్తవానికి గేమ్ చేంజర్ కు సీక్వెల్ ఉంటుందని ఇప్పటివరకు చిత్ర యూనిట్ లోని ఎవరూ అనౌన్స్ చేయలేదు. కనీసం దానికి సంబంధించిన హింట్ కూడా ఎక్కడా ఇవ్వలేదు. దేవర లాగే ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తీద్దామని సడెన్ గా డిసైడ్ అయ్యారనుకుందామంటే ఈ సినిమా ఇప్పుడు మొదలైంది కాదు. గేమ్ చేంజర్ స్టార్టయ్యి రెండేళ్లు దాటింది.
ఇప్పటికీ ఇంకా షూటింగ్ పూర్తి కాక షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. అలాంటప్పుడు ఇక పార్ట్ 2 అంటేఎప్పుడు తీస్తారు? ఇప్పటికే ఈ సినిమాతో రామ్ చరణ్ టైమ్ చాలా వేస్టయింది. మళ్లీ పార్ట్ 2 అంటే బోలెడు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ వైపు బుచ్చిబాబు చరణ్ కోసం ఎప్పుడెప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో గేమ్ చేంజర్2 అంటే కష్టమే. మరి ఈ పుకార్లకు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.













