లేటు చేస్తున్న చరణ్
గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటి వరకు ఆచార్య మూవీతో మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆచార్య సినిమా కూడా ఆయనది పూర్తి నిడివి పాత్ర కాదు. మెగాస్టార్ చిరంజీవి చిత్రంగా ఆచార్య తెరకెక్కింది. ఈ లెక్కన చూసుకుంటే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న మూవీ గేమ్ చేంజర్ అని చెప్పాలి.
ఇండియన్2 షూటింగ్ వల్ల గేమ్ ఛేంజర్ లేటవుతూ వచ్చంది. రీసెంట్ గా ఇండియన్2 షూటింగ్ పూర్తయింది. గేమ్ ఛేంజర్ ఇప్పటికీ సెట్స్ పైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ తీసుకోనని చెప్పిన చరణ్, అనుకోకుండానే రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్, బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. గేమ్ ఛేంజర్ పూర్తయిన వెంటనే చరణ్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వాస్తవానికి ఈ సినిమా 2024 ఆరంభంలోనే సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. 2024 మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లినా ఓ ఏడాది పాటూ షూటింగ్ ఉంటుంది. కాబట్టి గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు సినిమా రావడానికి కూడా ఎంతలేదన్నా ఏడాదిన్నర పడుతుంది. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఇలా లేట్ గా సినిమాలు చేస్తే ఎలా అని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.













