యంగ్ సీఎంగా చరణ్..?
శంకర్ డైరక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50 వ సినిమాగా, చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ కథ ఏ నేపథ్యంలో ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ యంగ్ సీఎం గా కనిపించనున్నారనే టాక్ కూడా నడుస్తుంది. శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీ రూపొందనుందట. మరి చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, RC15 లో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ మరోసారి జోడీ కట్టనుందని తెలుస్తుంది. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు పూర్తి చేసుకున్నాక ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.













