‘దర్శకుడు’ పాటల వేడుకకు రామ్‌చరణ్
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెల 15న జరుగనున్న ఈ చిత్రం పాటల విడుదల వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. అందుకే ‘దర్శకుడు’కి అతిథి కావడానికి చరణ్ అంగీకరించి ఉంటారు. అశోక్, ఇషా, పూజిత, నోయల్, నవీన్ సుదర్శన్ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయికార్తీక్ స్వరాలు సమకూరుస్తున్నారు.













