సెన్సార్పూర్తి చేసుకున్న రామసక్కనోళ్లు
ఎన్ఎస్ఎన్ మూవీ మేకర్స్ పతాకంపై సునయన పరాంకుశం సమర్పణలో సతీష్కుమార సాత్పడి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం రామసక్కనోళ్లు. ఫహీం సర్కార్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి హరీష్రావు ఈ చిత్రం టీంను అభినందించారు. నిర్మాత మాట్లాడుతూ త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. చమ్మక్ చంద్ర, సలీం షేక్ హీరోలుగా నటిస్తున్నారు. మేఘనాచౌదరి, షియాజీ షిండే, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.













