పీపుల్స్ మీడియాకు రామబాణం ఎఫెక్ట్
రీసెంట్గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పేరు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది కార్తికేయ తో మంచి సక్సెస్ అందుకుంది ఈ బ్యానర్. ఇప్పుడు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా అందరూ ఆ బ్యానర్ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. దానికి తోడు రీసెంట్ గా ఈ బ్యానర్లో 30 సినిమాలు లైన్ లో ఉన్నట్లు వచ్చిన వార్తలు కూడా ఈ బ్యానర్ ను వార్తల్లో నిలిచేలా చేశాయి.
దీంతో రాబోయే రోజుల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇండియాలో టాప్ ప్రొడక్షన్ హౌస్ ల్లో ఒకటిగా పీపుల్స్ మీడియా రాబోతుందని సైన్స్ కూడా వినిపించాయి. ఇలాంటి టైమ్ లో ఆ బ్యానర్‌కు ఓ గట్టి దెబ్బ తగిలింది. యాక్షన్ హీరో గోపీచంద్ తో ఈ బ్యానర్ లో వచ్చిన రామబాణం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. మధ్యాహ్నం షో ల నుంచే ఈ సినిమా చతికిలపడటాన్ని బట్టి ఈ సినిమా ఎంత పెద్ద ఫెయిల్యూరో అర్థం చేసుకోవచ్చు.
గోపీచంద్, శ్రీవాస్ కాంబో ని మాత్రమే చూసి ఈ సినిమాకు టెంప్ట్ అయినట్లుంది పీపుల్స్ మీడియా. వీరి కాంబోలో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్లు కావడంతో స్టోరీతో పనిలేకుండా, వారి ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా సినిమాను ఓకే చేసుకుని, ఆఖరికి ఇలా తీవ్రంగా నష్టపోయారు. వాస్తవానికి ఈ సినిమాను వేరే బ్యానర్ రిజెక్ట్ చేయడంతో, ఈ బ్యానర్ లో తెరకెక్కించారట.
ఎంత మంచి కాంబో అయినా సరే మంచి కథ ఉంటేనే ఆ సినిమాకు ఈ రోజుల్లో ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు తప్పించి, కథ కొంచెం అటు ఇటు అయినా సరే అటు వైపుకు చూడట్లేదు జనాలు. కార్తికేయ2తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థకు రామబాణం రిజల్ట్ ఓ దిష్టి చుక్క అనుకోవాల్సింది తప్పించి అంతకుమించి చేయగలిగిందేమీ లేదు.













