తన క్యారెక్టర్‌ను ఎంకరేజ్ చేయనంటున్న రామ్
పూరీ జగన్నాధ్ సినిమాలకు తెలుగులోనే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజే ఉంటుంది. అందుకే లైగర్ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ ఆ హైప్ ను లైగర్ క్యాష్ చేసుకోలేకపోయింది. కంటెంట్ బలహీనంగా ఉండటం వల్ల లైగర్ డిజాస్టర్ అయింది. అయితే ఈసారి ఎలా అయినా బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ఎంతో కసిగా ఉన్నాడు పూరీ.
రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తనను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటం వల్ల నార్త్ లో కూడా డబుల్ ఇస్మార్ట్ కు మంచి బజ్ నెలకొంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ, రియల్ లైఫ్ లో శంకర్ క్యారెక్టర్ ను తను ఏ మాత్రం ఎంకరేజ్ చేయనని, ఎవరూ ఈ పాత్రని ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదని, ఒకవేళ అలా చేస్తే వెంటనే పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారని రామ్ హెచ్చరించాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని, ఈ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని రామ్ తెలిపాడు.













