సంక్రాంతికి థియేటర్లో నే నా సినిమా విడుదల చేస్తా! : ఇస్మార్ట్ రామ్
కేంద్ర ప్రభుత్వం షూటింగులు జరుపుకోండని ఆర్డర్ ఇచ్చిన సెట్స్ మీదకు వెళ్లి కరోనా బారిన పడటంతో చాలా మంది నటులు, టెక్నీషియన్లు ఇప్పుడు షూటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. సగం ముప్పావు వంతు పూర్తయిన సినిమాలను విడుదలకు సిద్ధం చేసుకోవాలని నిర్మాతలు భావించినా పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. అయితే ఇవన్నీ లెక్కచేయాకుండా సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన కొత్త సినిమాల పక్కన పెడితే బ్యాలన్స్ వర్క్ వున్నా సినిమాల షూటింగ్లు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటె ఈ దసరాకు రెడీ కాకపోయినా సంక్రాంతికి విడుదల చేసుకోవచ్చని భారీ నిర్మాతలు భావిస్తున్నారు.
ఏదేమైనా పూర్తిస్థాయిలో షూటింగ్స్ మళ్లీ మొదలయ్యేది జనవరిలోనే అని ప్రముఖ నిర్మాతలు సన్నిహితులతో చెబుతున్నారు. షూటింగ్ స్టార్ట్ అయి ఎవరికైనా కరోనా సోకితే దానికి నిర్మాతే భారం మోయాల్సి రావడంతో ఆ రిస్క్ తీసుకునేందుకు తటపటాహిస్తున్నారు. నాని ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల అవుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇంకా అనుష్క ‘నిశ్శబ్దం’ సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెట్టరు’ సినిమాల నిర్మాతలు ఓ టి టి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఇలా ఉండగా రామ్ హీరోగా చేసిన సినెమా ‘రెడ్’ షూటింగ్ బాలన్స్ వుంది. సంక్రాంతి వరకు మళ్లీ థియేటర్స్ బిజినెస్ నార్మల్ అవుతుందనే నమ్మకంతో సంక్రాంతికి రామ్ ‘రెడ్’ థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తానంటూ రామ్ భీష్మించుకున్నాడు. ఒకవేళ నవంబర్ నాటికి షూటింగ్స్ మొదలు కాని పక్షంలో రామ్ సోలోగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తాడు.













