రిస్క్ ఎందుకులే అనుకున్న బోయపాటి
దసరాకు ఇంకా చాలా టైమ్ ఉండగానే పెద్ద హీరోలంతా తమ తమ సినిమాలను రిలీజ్ చేయడానికి డేట్స్ ను లాక్ చేసుకున్నారు. ఇప్పటికే దసరా సీజన్‌కు బాలకృష్ణ 108వ సినిమా భగవంత్ కేసరి, రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో అఫీషియల్ గా షెడ్యూల్ అయ్యాయి. అక్టోబర్ 20ని టార్గెట్ చేసుకుని ఈ మూడు సినిమాలు పోటీకి సిద్దమయ్యాయి.
వీటికంటే ముందే రామ్-బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా దసరాకు రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ సినిమాను ప్రీ పోన్ చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాను ఈ డేట్ లో రిలీజ్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.
సినిమా రిలీజ్ ను ఒక నెల ముందుకు ప్రీ పోన్ చేయడంతో రిలీజ్ కు టైమ్ తక్కువ ఉంది. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగవంతం చేయాల్సి ఉంటుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ థండర్ చూస్తే అర్థమవుతుంది. రామ్ ఈ సినిమా కోసం బాడీతో పాటూ గడ్డాన్ని కూడా పెంచాడు.
అయితే ఈ సినిమాతో పాటూ వస్తున్న టిల్లు స్వ్కేర్ సినిమా మీద కూడా మంచి అంచనాలున్నాయి. కానీ ఈ రెండింటికీ పోటీ ఉండదు. రెండూ డిఫరెంట్ జానర్ సినిమాలు కాబట్టి ఏ ఆడియన్స్ ఆ సినిమాకు వెళ్తారు. దసరా రేసు నుంచి ఈ సినిమా తప్పుకోవడం వల్ల రామ్ కు ఓపెనింగ్స్ ప్రమాదం పెద్దగా ఉండదు. ఈ రిలీజ్ డేట్ వల్ల మార్కెట్ లో మాస్ ఆడియన్స్ ని సోలోగా ఇంప్రెస్ చేసే ఛాన్స్ దక్కింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.













