Ram Pothineni: లిరిక్ రైటర్ గా మారిన రాపో
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothieni) కి సక్సెస్ మాత్రం అంత ఈజీగా దక్కడం లేదు. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రామ్ ఆఖరిగా హిట్ అందుకుంది పూరీ జగన్నాథ్(Puri jagannadh) తో చేసిన ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) మూవీతోనే. ఈ సినిమా తర్వాత రామ్ నుంచి పలు సినిమాలొచ్చాయి కానీ అవన్నీ ఫ్లాపులుగానే మిగిలాయి.
గతేడాది బోయపాటి(Boyapati Srinu) దర్శకత్వంలో స్కంద(Skandha) సినిమా చేసి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న రామ్ ప్రస్తుతం మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) డైరెక్టర్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ కెరీర్లో 22వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం రామ్ పోతినేని ఓ లిరిక్ రైటర్ గా మారినట్టు తెలుస్తోంది. రాపో22(RAPO22) సినిమాలో ఓ సాంగ్ కు రామ్ లిరిక్స్ అందించాడట. ఈ పాట లవ్ సాంగ్ అని సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ అభిమానులు తమ హీరోలో ఈ టాలెంట్ కూడా ఉందా అని షాకవుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్(Vivek)- మెర్విన్(Mervin) ద్వయం సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తుంది.













