Ram Pothineni: రామ్ ఈ ఏడాదైనా గుడ్ న్యూస్ చెప్తాడా?
నితిన్(Nithin), శర్వానంద్(Sharwanand), నాగ చైతన్య(Naga Chaitanya) ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తేజ్ కోసం తన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లని వెతుకుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) పరిస్థితేంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.
అయితే రామ్ ఇంట కూడా త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. రామ్ కుటుంబ సభ్యులు కూడా రామ్ కోసం అమ్మాయిని వెతికే పనిలో బిజీగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. రామ్ వయసు ఇప్పటికే 36 దాటడంతో ఇక లేట్ చేయొద్దని రామ్ ఫ్యామిలీ తనకు పెళ్లి చేయాలని సీరియస్ గానే ట్రై చేస్తుందట.
దీంతో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకడైన రామ్ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో చేస్తున్న సినిమా పైనే పెట్టాడు రామ్. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) తర్వాత రామ్ చేసిన ప్రతీ సినిమా ఫ్లాపే అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రామ్. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తోంది.













