మరో మాస్ సినిమాను ఓకే చేసిన ఎనర్జిటిక్ స్టార్
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తర్వాతి సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతున్నట్లు తెలుస్తుంది. డైరక్టర్ లింగు స్వామి తో సినిమా ఫిక్స్ అయినప్పుడే షూట్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. మాస్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో మాస్ హీరోగా మరో మెట్టు ఎక్కేందుకు రామ్ తెగ ట్రై చేస్తున్నాడు. కొన్నేళ్లుగా రామ్ కమర్షియల్ హీరోగా సెటిల్ అవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ నుంచి మాస్ కథల కోసమే వెయిట్ చేసి లింగు స్వామి కథను ఓకే చేశాడు రామ్. చివరగా చేసిన రెడ్ సినిమా కూడా మాస్ కంటెంట్ తోనే తెరకెక్కింది.
ప్రస్తుతం లింగు స్వామి సినిమా కోసం తనను తానను సిద్ధం చేసుకుంటున్న రామ్ సరసన హీరోయిన్ కృతిశెట్టి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇదిలా ఉంటే రామ్ మరో మాస్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా చేయనున్నాడట. రీసెంట్ గా బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే రామ్ ఓకే చెప్పేసినట్లు తెలుస్తుంది. అసలే మాస్ ఫేమ్ కోసం ఎదురుచూస్తున్నాడు రామ్ కు సరైన టైమ్ లో బోయపాటితో సినిమా అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి తో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మే లో అది రిలీజ్ కానుంది. ఆ సినిమా తర్వాత రామ్ సినిమా స్క్రిప్ట్ పైనే బోయపాటి వర్క్ చేయనున్నాడట. ఈ సినిమాను కూడా మిర్యాల రవీందర్ రెడ్డి యే నిర్మిస్తారని తెలుస్తుంది.













