ఊచకోత కోస్తున్న ‘స్కంద’
బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ప్రీ రిలీజ్ థండర్ లో స్కంద ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి శీను ఊర మాస్ చూపించేశారు. ఇస్మార్ట్ శంకర్ లో చూసిన దానికంటే రామ్ భిన్నంగా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. విజువల్స్ కూడా టోటల్ గూస్ బంప్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రాసుకున్నట్లు అనిపిస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాకు బజ్ కూడా బాగా వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ లో సినిమా స్టోరీని ఎక్కడా పెద్దగా రివీల్ చేయకుండా చాలా తెలివిగా కట్ చేశారు. కాలేజీలో చదువుకుంటున్నా ఎవరినీ లెక్క చేయని తత్వం హీరోది.
తప్పు జరిగితే కొట్టేసే మనస్తత్వం ఉన్న రామ్, శ్రీలీల లాంటి అందమైన అమ్మాయి ఎదురుగా ఉన్నా నువ్వేమైనా అందగత్తెవా అని చెప్పే టైపు. స్వంత ఊరిలో తండ్రికి ఓ సమస్య వస్తుంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగడంతో కుటుంబ సభ్యులు సైతం రిస్క్‌లో పడతారు. ఇక స్కంద అసలు రూపం బయటకొచ్చి, ఊచకోత తప్ప ఇంకేమీ తెలియని అవతారమెత్తుతాడు. ట్రైలర్ లో బోయపాటి శీను మాస్ బాగా కనిపిస్తుంది. అఖండ, లెజెండ్, సింహా, జయ జానకి నాయక షేడ్స్ ఉన్నప్పటికీ ఓవర్ ది టాప్ హీరోయిజంతో విజిల్స్ ఎలా వేయించుకోవాలో బాగా తెలిసిన డైరెక్టర్ గా తన పనితనాన్ని చూపించాడు. సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న స్కంద సినిమా మీద అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకుంటే స్కంద హిట్ కొట్టినట్టే.













